చలో అసెంబ్లీ విరమించుకోండి: రోశయ్య

విద్యార్థులకు చదువులకు భంగం వాటిల్లకుండా చూడాలని కూడా ఆయన అన్నారు. విద్యార్థులు విద్యాసంవత్సరం నష్టపోకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఎవరైనా కొరితే ఉద్యోగాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి 1986లో జారీ అయిన 610 జీవో అమలుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, లేదంటే సభా సంఘాన్ని వేస్తానని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనపై, ప్రాంతీయ మండళ్ల ఏర్పాటుపై మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై తాను శాసనసభలో సమాధానం ఇస్తానని ఆయన చెప్పారు.
దయచేసి రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు చూసుకుంటున్నారని ఆయన చెప్పారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ పని మొదలైందని, ఈ స్థితిలో ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications