బెంగళూరు: పాత విమానాశ్రయం సమీపంలోని కార్టెల్ టవర్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. 30 మంది గాయపడ్డారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. మంటల్లో చిక్కుకున్న అపార్ట్‌మెంట్‌వాసులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తోంది. ఆరు అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగాయి. ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రదేశం అయినందున సహాయక చర్యలు చురుకుగా చూపట్టడానికి ఇబ్బందిగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది 30 మందిని రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.