వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గొడవ: అసెంబ్లీ మూడోసారి వాయిదా

తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని తెలుగుదేశం సభ్యులు పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయం చేపట్టాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సభ్యులు చెప్పినట్లు సభ నడవదని, కొన్ని సంప్రదాయాల ప్రకారం నడుస్తుందని స్పీకర్ చెప్పారు. విద్యార్థుల ఆత్మబలిదానాలపై ప్రభుత్వం తగిన సమయంలో ప్రకటన చేస్తుందని స్పీకర్ చెప్పినా తెలుగుదేశం సభ్యులు వినలేదు. దీంతో సభను గంట పాటు స్పీకర్ వాయిదా వేశారు. అనంతరం తెలుగుదేశం సభ్యులు స్పీకర్ ను ఆయన ఛేంబర్ లో కలిశారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వం చేత శాసనసభలో ఒక ప్రకటన చేయించాలని వారు స్పీకర్ ను కోరారు.