ఏడేళ్ళ బాలికపై 60 ఏళ్ళ వృద్ధుడి అత్యాచారం

Khammam Dist
బోనకల్‌: కామంతో కళ్ళు మూసుకుపోయిన వృద్ధుడు బాలికపై అత్యాచారానికి పాల్పడినసంఘటన బోనకల్‌ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని చొప్పకట్లపాలెం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు...గ్రామంలోని ఏడేళ్ల బాలిక అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకుంటోంది. తల్లి కూలిపని చేస్తుండగా తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. దీంతో వారు ఇంటివద్ద తాత సంర క్షణలో ఆమెను వదిలివెళ్లారు.

అయితే తాత ఇంట్లోనుంచి బజారుకు వెళ్లిన సమయాన్ని పక్కనే ఉంటున్న మరో 60 ఏళ్ల వృద్ధుడు గమనించాడు. అతడు బాలికవద్దకు వెళ్లి ఇడ్లీ పెట్టిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకుపోయి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ సంఘటన చొప్పకట్లపాలెం గ్రామంలో సంచలనం సృష్టించింది. గ్రామస్థులు సదరు వృద్ధున్ని పట్టుకుని చితకబాదారు. అయితే నిందితుని బంధువులు రాజీప్రయత్నాలు చేయడంతో స్థానిక వీఆర్వో బాషా పోలీసులకు ఫిర్యాదుచేశాడు. అయితే బాలిక తల్లిదండ్రులు ఈ విషయంపై ఏమీ జరగలేదని చెబుతుండగా మరోవైపు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

మధిర మండలం మడుపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్‌ బాలికపై సోమవారం ఇద్దరు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఈ ఘటనపై బాలిక ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలోని ఓ విద్యార్థిని ఇంటిముందు కూర్చొని చదువుకుంటుండగా బాలకృష్ణ, నాగరాజు అనే ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో వారిపై కేసునమోదుచేసినట్లు ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల్లో ఒకరు అదేగ్రామానికి చెందిన వాడు కాగా, మరొకరు కృష్ణజిల్లా వత్సవాయి గ్రామానికి చెందిన వాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+