వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఒయులో నక్సల్స్ ఉంటే చూపండి: సుప్రీంకోర్టు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నక్సలైట్లు లేరని, అన్ని కార్యక్రమాలు కూడా ప్రశాంతంగానే జరుగుతున్నాయని తాము సుప్రీంకోర్టుకు విన్నవించినట్లు ఒయు విద్యార్థుల తరఫు న్యాయవాది చెప్పారు. బలగాల మోహరింపు వల్లనే పరిస్థితి విషమిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికే ప్రభుత్వం పారా మిలటరీ బలగాలను, ఇతర బలగాలను ఒయులో మోహరిస్తోందని తాము సుప్రీంకోర్టుకు విన్నవించామని ఆయన అన్నారు. అణచివేత చర్యలకు దిగితేనే విద్యార్థులు నక్సలైట్లుగా మారే ప్రమాదం ఉంటుందని, 1969లో అటువంటి పరిస్థితే ఎదురైందని ఆయన అన్నారు. మావోయిస్టు నేత కిషన్ జీ ఒక ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సిడిని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు అందజేసినట్లు ఆయన తెలిపారు.