వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'ద్రౌపది' నవల సిగ్గుపడేలా ఉంది: ఓలేటి

By Santaram
|
Google Oneindia TeluguNews

Yarlagadda Lakshmi Prasad
రాజమండ్రి: హిందీ అకాడమీ చైర్మన్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ రాసిన ద్రౌపది నవల సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ధర్మ జాగరణ సమితి తూర్పు ఆంధ్ర ప్రాంత అధ్యక్షుడు ఓలేటి సత్యనారాయణ విమర్శించారు. అన్నాచెల్లెళ్ళు అయిన కృష్ణుడు, ద్రౌపదికి అక్రమ సంబంధం అంటగట్టేలా యార్లగడ రాసిన నవలకు సాహిత్య పండితుడు బేతవోలు రామబహ్మం కితాబు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పనిలేని వారే వ్యాఖ్యలు చేస్తున్నారని, ద్రౌపది నవలను చదివి అప్పుడు విమర్శలు చేయాలని బేతవోలు అన్న మాటలను సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు.

నవల అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు రాసుకుంటారని, ఐతే ద్రౌపది, శ్రీకృష్ణులను కించపరుస్తూ యార్లగడ్డ రాసిన నవలను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేయడం సబబుగాలేదన్నారు. జ్యూరీ సభ్యులందరూ కలిసి భారతీయ విలువలను నాశనం చేశారని విమర్శించారు. అందరి లో మంచి స్థానం సంపాదించుకున్న బేతవోలు, యార్లగడ్డను వెనకేసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అర్ధం కావడం లేదన్నారు. యార్లగడ్డకు ఇచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. విశ్వ హిందూ పరిషత్‌ నగర అధ్యక్షుడు నీలం శేషగిరి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుబ్బారామశాస్త్రి, ధర్మ జాగరణ సమితి నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X