పరిచయాలకే రేపటి పర్యటన: దుగ్గల్

VK Duggal
న్యూఢిల్లీ: రేపటి పర్యటన రాజకీయ పార్టీలతో పరిచయాలకు మాత్రమేనని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సభ్య కార్యదర్సి వికె దుగ్గల్ చెప్పారు. రాజకీయ పార్టీలను మర్యాదపూర్వకంగా కలుస్తామని, వినతిపత్రాలు తీసుకోబోమని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తమ కమిటీకి అనూహ్య స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. తమది ఉన్నత స్థాయి కమిటీ అని, తమ నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. బిజెపి కూడా తమ కమిటీకి నివేదిక సమర్పిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. కమిటీ కార్యకలాపాలకు కావలసిన మౌలిక ఏర్పాట్లను సమీక్షిస్తామని, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ పర్యటించాలనే విషయంపై ఒక అవగాహనకు వస్తామని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ తెలంగాణలో పర్యటించాలని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అనడంలో తప్పేమీ లేదని ఆయన అన్నారు. అవసరాన్ని బట్టి కమిటీ మూడు ప్రాంతాల్లో పర్యటిస్తుందని ఆయన చెప్పారు. తమ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుని సిఫార్సులు మాత్రమే చేస్తుందని ఆయన అన్నారు. అమలుపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని ఆయన అన్నారు. మీడియా నిర్మాణాత్మక సహకారం అందించాలని ఆయన కోరారు. కమిటీకి 9 నెలలు ఎక్కువ కాలవ్యవధి కాదని ఆయన అన్నారు. తమకు తరుచుగా రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని ఆయన అన్నారు. ప్రజలు పరిశోధనాత్మకమైన నివేదికలు అందిస్తే తమకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు. ఏప్రిల్ నుంచి జులైలోగా అన్ని ప్రాంతాల్లో తాము పర్యటిస్తామని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+