రోశయ్య తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం

Kiran Kumar Reddy
హైదారబాద్: శాసనసభ నుంచి ముఖ్యమంత్రి కె రోశయ్య శుక్రవారం శాసనసభ నుంచి అర్థాంతరంగా వెళ్లిపోవడంపై ప్రతిపక్షాలు శనివారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ముఖ్యమంత్రి వైఖరికి నిరసన తెలిపిన తర్వాతనే సభను సజావుగా నడవనిస్తామని ప్రతిపక్షాలు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి తేల్చి చెప్పాయి. సభ నిర్వహణపై స్పీకర్ శనివారం ఉదయం శాసనసభా పక్ష నేతలతో సమావేశమయ్యారు. అన్ని పార్టీల సభ్యులు మాట్లాడిన తర్వాతనే ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు పట్టు బట్టాయి.

ప్రతిపక్షాల సభ్యుల పట్టుకు స్పీకర్ అంగీకరించలేదు. ముఖ్యమత్రి వివరణ తర్వాతనే అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పారు. దాంతో సమస్య సద్దుమణగలేదు. కాగా, స్పీకర్ కు కూడా చెప్పకుండా ముఖ్యమంత్రి సభ నుంచి వెళ్లిపోయారని, అది స్పీకర్ ను అవమానించడమేనని మజ్లీస్ సభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. దానిపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. అయితే ముఖ్యమంత్రి రోశయ్య తనను అవమాన పరచలేదని, తన అనుమతి తీసుకునే శుక్రవారం సభ నుంచి వెళ్లిపోయారని స్పీకర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+