తెలంగాణ: పిఎం వివరణపై వెంకయ్య అసంతృప్తి

రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన హోం వర్క్ చేయలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రిని, తన పార్టీ పార్లమెంటు సభ్యులను కూడా సంప్రదించకుండా కాంగ్రెసు ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ప్రకటన చేసిందని ఆయన విమర్శించారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ఏకపక్షంగా నిర్ణయం ప్రకటించిన తర్వాత అధికార పక్ష నాయకులే ఆందోళనలకు దిగారని, ఈ స్థితిలో మిగతా పార్టీలు అలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదని ఆయన అన్నారు. వందలాది మంది మరణిస్తుంటే పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఏ మాత్రం చొరవ చూపడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications