దుబాయ్ లో తెలుగు యువతులతో వ్యభిచారం

మండపేటకు చెందిన సల్మాన్, చొల్లంగి శ్రీను కలిసి 2007-09 మధ్య కాలంలో రాజమండ్రి, మండపేటకు చెందిన ముగ్గురు బాలికలను చెన్నైకి చెందిన ఎండి ఇక్బాల్ ద్వారా దుబాయ్‌కి పంపారు. బెంగళూరుకు చెందిన ఛాందమా భాను అలియాస్ జెరీనా అలియాస్ ఫర్వీద్ అనే మహిళ, బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్లిన అబ్దుల్ అమీర్ హుమరబ్బా ద్వారా ఆ దేశంలో వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. రాజమండ్రి, మండపేట నుంచి తరలించిన ముగ్గురు బాలికలను ఇక్కడ నిర్బంధించి, బలవంతంగా వ్యభిచారం చేయించారు. ఆ బాలికల వద్దకు రోజూ 50, 60 మంది విటులను పంపేవారు. దుబాయ్ లో ఉంటున్న నల్గొండవాసి రాజు అనే యువకుడి సహాయంతో ఈ ముగ్గురు బాలికలు స్వస్థలానికి చేరుకుని మండపేట పోలీసులను ఆశ్రయించారు.
ఎస్పీ వై నాగిరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రపురం డీఎస్పీ సోమశేఖర్, మండపేట సీఐ సత్యానందంతో కూడిన బృందం నిందితుల కోసం గాలింపు చేపట్టింది. బాధితులను చెన్నైలోని దేవరాజ్ ట్రస్ట్ సహా యంతో రాజమండ్రి తీసుకువచ్చారు. బాలికల రవాణాలో చెన్నైకి చెందిన ఇక్బాల్, వెల్లూరుకు చెందిన చాంద్‌మా భాను, మండపేటకు చెం దిన చొల్లంగి శ్రీను, సల్మాన్ హుస్సేన్‌లను అరె స్టు చేశారు. బెంగళూరుకు చెందిన అబ్దుల్ అమీర్ హుమరబ్బా, చెన్నైకి చెందిన జాఫర్, జయశ్రీ, కేరళకు చెందిన షాజన్, మంగుళూరుకు చెందిన బషీర్, రాజమండ్రికి చెందిన అరుణశ్రీ, రాష్ట్రానికి చెందిన భానులను పట్టుకోవాల్సి ఉందన్నారు. హుమరబ్బా బెంగళూరు పోలీ సుల నుంచి త్రుటిలో తప్పించుకుని దుబాయ్ వెళ్లిపోయాడన్నారు. దు బాయ్‌లో ఇంకా 50 నుంచి 70 మంది వరకూ ఈ కూపంలో చిక్కుకుని ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications