తిరుపతి: తిరుపతి ప్రసూతి ఆస్పత్రిలో హైటెక్ దొంగతనం జరిగింది. తిరుపతి మెటర్నిటీ ఆస్పత్రిలోకి వైద్యుడి వేషంలో ప్రవేశించిన దొంగ తన పని యథేచ్ఛగా సాగించాడు. రోగుల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు చోరీ చేశాడు. రోగులను పరీక్షించే నెపంతో ఆభరణాలను అతను దోచుకెళ్లాడు.
దొంగను పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇంతకు ముందు రెండు, మూడు కేసుల్లో నిందితుడని తెలుస్తోంది. అతనికి వివిధ రూపాల్లో దొంగతనాలు చేయడం అలవాటుగా పోలీసులు చెబుతున్నారు.