విశాఖ-విజయవాడ-షిర్డి మధ్య ప్రత్యేక రైళ్ళు

Special Trains
విజయవాడ: ప్రయాణికుల రద్దీ సందర్భంగా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే విశాఖపట్నం-సాయినగర్‌ షిర్డీ మధ్య ప్రత్యేక రైళ్లను నిర్వహిస్తున్నట్లు విజయవాడ పౌర సంబంధాల అధికారి అనిల్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈనెల 3వ తేదీ నుంచి ఏప్రిల్‌ 29వ తేదీ వరకూ నడుస్తాయన్నారు. విశాఖపట్నం-సాయినగర్‌(షిర్డీ)(నెంబరు 0867) ప్రత్యేక రైలు విశాఖపట్నంలో ఈనెల 10, 13, 17, 20, 24, 27, 31, ఏప్రిల్‌ 7, 10, 14, 17, 21, 24, 28వ తేదీల్లో (ప్రతి బుధ, శనివారాలు)లో ఉదయం 05.30 గంటలకు బయలుదేరుతుంది.

ఈ రైలు విజయవాడ ఉదయం 11.35 గంటలకు, సికింద్రాబాద్‌ సాయంత్రం 06.10 గంటలకు, సాయినగర్‌ (షిర్డీ)కి మరుసటి రోజు ఉదయం 11.00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో సాయినగర్‌ (షిర్డీ)-విశాఖపట్నం (నెంబరు 0868) ప్రత్యేక రైలు ఈనెల 11, 14, 18, 21, 25, 28, ఏప్రిల్‌ 1, 4, 8, 11, 15, 18, 22, 25, 29వ తేదీల్లో(ప్రతీ గురు, ఆదివారాలు) సాయినగర్‌ లో సాయంత్రం 06.20 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు సికింద్రాబాద్‌ కు మరుసటి రోజు ఉదయం 09.45కి, విజయవాడకు సాయంత్రం 04.00 గంటలకు, విశాఖపట్నం రాత్రి 10.45 గంటలకు చేరుతుందని పౌరసరఫరాల అధికారి పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+