నల్లమలలో మరణించింది శాఖమూరి

Prakasam
ఒంగోలు: ప్రకాశం జిల్లా నల్లమల అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య శుక్రవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన నక్సలైట్ ను మావోయిస్టు అగ్రనేత శాఖమూరి అప్పారావు అలియాస్ రవి అలియాస్ వెంకన్నగా గుర్తించారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టును తొలుత జాన్ బాబూరావుగా అనుమానిస్తున్నారు. కానీ అతను శాఖమూరి అప్పారావుగా గుర్తించారు. ఇది మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ. ఇప్పుడు అతను మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. శాఖమూరిపై 30కి పైగా కేసులున్నాయి. వీటిలో ఎక్కువగా హత్య కేసులే. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హత్యకు కూడా శాఖమూరి అప్పారావు రెకీ నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ ఎన్ కౌంటర్ నుంచి ముగ్గురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు చెబుతున్నారు.

నల్లమల అడవుల్లో 2007లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్సి మాధవ్ ఎన్ కౌంటర్ తర్వాత శాఖమూరి అప్పారావుదే పెద్ద ఎన్ కౌంటర్. శాఖమూరి అప్పారావు తొలిసారి 1993లో తొలిసారి అరెస్టయ్యాడు. శాఖమూరి అప్పారావు 2000ల్లో బెయిల్ పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్కే రక్షణ దళంలో అతను పనిచేశాడు. వరంగల్ జిల్లా ఖానాపూర్ కు చెందిన శాఖమూరి అప్పారావు వరంగల్ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఆర్ఎస్ యులో పనిచేశాడు. 1982లో అతను తొలిసారి అజ్ఞాతంలోకి వెళ్లాడు. తిరుపతిలోని అలిపిరిలో నారా చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో, ఐపియస్ అధికారులు ఉమేష్ చంద్ర, వ్యాస్ హత్యకేసుల్లో అప్పారావు నిందితుడు.

అప్పారావు ఎన్ కౌంటర్ పై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల క్రితం అప్పారావును మహారాష్ట్రలో అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అయితే, మావోయిస్టుల సమావేశం జరుగుతుందని తెలిసి తాము వెళ్లామని, అప్పుడు మావోయిస్టులు ఎదురు పడ్డారని, ఈ సమయంలో ఎన్ కౌంటర్ జరిగిందని పోలీసులు అంటున్నారు. తన కుమారుడిని ఎన్ కౌంటర్ పేర కాల్సి చంపారని శాఖమూరి అప్పారావు తల్లి సరోజ ఆరోపిస్తోంది.

రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ అప్పట్లో చర్చలకు వచ్చిన సమయంలో నల్లమల అడవుల్లో శాఖమూరి అప్పారావు వీడ్కోలు చెప్పాడు. రామకృష్ణ తన ఆయుధాన్ని శాఖమూరి అప్పారావుకే అప్పగించాడు. శాఖమూరి అప్పారావు భార్య రజిత 2007లో అప్పటి రాష్ట్ర కమిటీ కార్యదర్శి మాధవ్ తో పాటు ఎన్ కౌంటర్ లో మరణించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+