హైదరాబాద్: శ్రీశైలం కుడి గట్టు జల విద్యుత్కేంద్రం రెండో యూనిట్ లో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో మరింతగా కరెంట్ కష్టాలు తలెత్తే ప్రమాదం ఉంది. జనరేటర్ కాయిల్ కాలిపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రి జనరేటర్ కాయిల్ కాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. సాంకేతిక లోపం వల్లనే అది కాలిపోయిందని, అందులో మానవ తప్పిదమేమీ లేదని అధికారులు అంటున్నారు.
రెండు నెలల క్రితమే ఈ విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. అంతకు ముందు నీటిలో మునిగిపోవడంతో ఉత్పత్తి ఆగిపోయింది. దాన్ని బాగు చేయడానికి రెండు నెలల కాలం పట్టింది. ప్రస్తుత మరమ్మత్తుకు 15 రోజుల కాలం పట్టవచ్చునని అధికారులు అంటున్నారు.