న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్-పంజాబ్ సరిహద్దు, నికోబార్ దీవుల్లో ఆదివారం స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. అయితే ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించ లేదు. ఈ ఉదయం 8.13 గంటల ప్రాంతంలో నికోబార్ దీవుల్లో భూమి కంపించింది. మధ్యాహ్నం 12.23 గంటల ప్రాంతంలో హిమాచల్-పంజాబ్ సరిహద్దులో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై భూకంపన తీవ్రత 4.6గా నమోదయింది. హోషియాపూర్‌లో భూప్రకంపన కేంద్రాన్ని గుర్తించారు.