ముంబయి : ముంబయిలోని ఓయన్‌జీసిని పేల్చేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నం భగ్నమైంది.ఓయన్‌జీసీని పేల్చేందుకు యత్నించిన లతీఫ్, రియాజ్ అనే ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏటీయస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కుట్ర వెనుక దావూద్ ఇబ్రహీం హస్తమున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరంలో ఉన్నఒఎన్జిసి గ్యాస్ సేకరణ యూనిట్ల వద్ద భద్రతను పెంచారు.