హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ మాజీ అధిపతి రామలింగ రాజు ఆరోగ్యంపై హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం ఆరా తీసింది. వృద్రోగ సంబంధిత వ్యాధితో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రామలింగరాజుకు నాలుగు వారాల పాటు చికిత్స చేయాల్సి ఉంటుందని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు కోర్టుకు తెలిపారు.
సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు నిందితులను గురువారం నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు విచారణను నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.