న్యూఢిల్లీ: ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ గీసిన తైల వర్ణచిత్రం ఒకటి రూ.2.01 కోట్లకు అమ్ముడైంది. ఈ కళాఖండంలో నాలుగు గుర్రాలు, ఒక ఆడ రౌతును ఆయన చిత్రించారు. తమ వసంతకాల అమ్మకాల్లో అత్యధిక ధర పలికిన చిత్రం ఇదేనని ఆన్ లైన్ లో వేలం నిర్వహించే సాఫ్రాన్‌ఆర్ట్ తెలిపింది. ఆ వేలంలో సుబోధ్ గుప్తా "దూత్" 1.75 కోట్లకు అమ్ముడుపోయింది.
ఇటీవల ఖతార్ పౌరసత్వం అంగీకరించి హుస్సేన్ వార్తల్లోకి వచ్చారు. హిందూ దేవుళ్ళు, దేవతలను కించపరిచేలా ఆయన బొమ్మలు గీశారన్న విమర్శలూ ఉన్నాయి.