భువనేశ్వర్: ఒడిషాలోని కొంథమాల్‌లో ప్రవేశించేందుకు యత్నించిన విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్‌తొగాడియాను పోలీసులు అరెస్టు చేశారు. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నందున తొగాడియాను జిల్లాలోకి అనుమతించలేదని పోలీసు అధికార్లు వెల్లడించారు.
2008 ఆగస్టులో స్థానిక విశ్వహిందూపరిషత్ నాయకుడు స్వామి లక్ష్మణానందసరస్వతిని మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారు చంపివేయడంతో జిల్లా మతఘర్షణలతో అట్టుడికిపోయింది.