అవసరమైతే న్యాయవాదిని పెడ్తాం: బాబు

Chandrababu Naidu
హైదరాబాద్: విద్య, ఉద్యోగాల్లో ముస్లిం రిజర్వేషన్ల సాధనకు కోర్టులో వాదించడానికి అవసరమైతే తమ పార్టీ తరఫున న్యాయవాదిని పెడ్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీలకు హామీ ఇచ్చారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలుగుదేశం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ముస్లిం రిజర్వేషన్ల కల్పనకు శాసనసభలో బిల్లు ప్రతిపాదిస్తే తాము మద్దతిస్తామని ఆయన చెప్పారు. ముస్లింల రిజర్వేషన్ల సాధనకు తమ పార్టీ అండగా నిలుస్తుందని ఆయన చెప్పారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ముస్లింలు రిజర్వేషన్లు సాధించుకోవాలని ఆయన అన్నారు.

ఒబిసిలకు, మైనారిటీలకు తప్పనిసరిగా రిజర్వేషన్లు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇందుకు చొరవ చూపకపోతే తమ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆయన చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి తమ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+