నక్సల్స్ ఉద్యమ నేత కానూ సన్యాల్ ఆత్మహత్య

Kanu Sanyal
కోల్ కత్తా: నక్సలైట్ ఉద్యమ వ్యవస్థాపకుల్లో ఒకరైన కానూ సన్యాల్ మంగళవారం మరణించారు. ఆయన పశ్చిమ బెంగాల్లోని సిలిగిరి మండలంలో గల తన స్వగ్రామం నక్సల్బరీలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన చాలా కాలంగా అస్వస్థతతో బాధపడుతున్నట్లు సమాచారం. కానూ సన్యాల్ 1932లో జన్మించారు. ఆయనకిప్పుడు 78 ఏళ్ల వయస్సు. సాయుధ పోరాటం ద్వారా విప్లవాన్ని సాధించడానికి 1969 సిపిఐ (ఎంఎల్)ను స్థాపించిన వారిలో ఆయన ఒకరు. నక్సల్బరీ ఉద్యమ నేత చారు మజుందార్ కు ఆయన సమకాలికుడు.

కానూ సన్యాల్ 1970 ఆగస్టులో ఆరెస్టయ్యారు. ఆయన అరెస్టుకు నిరసనగా పెద్ద యెత్తున హింస చెలరేగింది. పార్వతీపురం కుట్ర కేసులో ఆయన ఏడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జైలులో ఉన్నారు. ఆయన 1977 లో జైలు నుంచి విడుదలయ్యారు. 1985లో సన్యాల్ ఐదు నక్సల్స్ గ్రూపులతో కలిసి కమ్యూనిస్టు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు - లెనినిస్టు)ను ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయే సమయానికి న్యూసిపిఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+