ఎన్ కౌంటర్: ముగ్గురు పోలీసుల మృతి

మృతుల్లో సంజయ్ దర్కి ఒడిషాలోని సుందర్ గడ్ కు చెందినవాడు. మిగతా ఇద్దరు బార్సిగుడాకు చెందినవారు. ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉపేంద్ర నాయక్, రాజేష్ ముండా, కృపా సింగ్ ప్రధాన్ లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆంధ్ర - ఒరిస్సా సరిహద్దులోని మోహనా వద్ద మావోయిస్టులు మూడు సెల్ టవర్లను పేల్చేశారు. ఈ స్థితిలో ఎఒబిలో రెడ్ అలర్డ్ ప్రకటించారు. మావోయిస్టులు 46 గంటల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications