అసెంబ్లీలో కొట్టుకున్న ఇద్దరు ఎమ్మెల్యేలు

మంత్రివర్గంలో కొత్త శాసనసభ్యులకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించడానికి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సంతకాల సేకరణ చేపట్టారు. దీనిపై వెంకట రమణారెడ్డి సంతకం చేయలేదు. పైగా అలా సంతకాలు చేయించడాన్ని వెంకట రమణారెడ్డి లక్ష్మారెడ్డిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగినట్లు భావిస్తున్నారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యను ఇబ్బందుల్లో పెట్టడానికే సంతకాల సేకరణ చేపట్టారని వెంకట రమణా రెడ్డి భావిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన తమ కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ వైయస్ జగన్ కు సన్నిహితురాలు కావడంతో జిల్లాలో ఆధిపత్య పోరులో గండ్ర జగన్ కు అనుకూలంగా లేరని తెలుస్తోంది. ఈ రాజకీయాలు కూడా ఇద్దరి మధ్య జగడానికి కారణమని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications