అమితాబ్ కు దూరం: కాంగ్రెసు ఆదేశం

కాంగ్రెసు తీరును ఎన్సీపి నాయకులు తేలిగ్గా కొట్టేయగా, అమితాబ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంతృప్తికి గురయ్యారు. ఈ స్థితిలో అమితాబ్ కు దూరంగా ఉండాలని కాంగ్రెసు అధిష్టానం ముఖ్యమంత్రి చవాన్ ను ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ కు అమితాబ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీంతో అమితాబ్ కు దూరంగా ఉండాలనేది కాంగ్రెసు వర్గాల అభిప్రాయం. అమితాబ్ స్వేచ్ఛను అరికట్టడం తమ ఉద్దేశం కాదని, గుజరాత్ అల్లర్లకు కారణమైన మోడీతో కలిసి పనిచేస్తున్న వ్యక్తిని తమ అధికార కార్యక్రమాలకు అహ్వానించాలా, వద్దా అనేది తమకు సంబంధించిన వ్యవహారమని కాంగ్రెసు వర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications