చిరు ఫ్యామిలీకి దగ్గరైన దాసరి

పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం సోమవారం ఉదయం హైదరాబాదులోని తాజ్ కృష్ణాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య, పార్లమెంటు సభ్యురాలు బొత్స ఝాన్సీ హాజరయ్యారు. తాను పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలనుకుంటున్నట్లు ఇటీవలి చిరంజీవిని కలిసినప్పుడు బొత్స సత్యనారాయణ చెప్పిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను గణేష్, బొత్స సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, మారిన రాజకీయ పరిణామాలే దాసరి నారాయణ రావు, చిరంజీవి కుటుంబాలు దగ్గరవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దిరితో పాటు బొత్స సత్యనారాయణ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర తమ ప్రాబల్యం కోసం వీరు ఒక్కటవుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఎదుర్కోవడం వీరి వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications