ఓదార్పు యాత్రపై సోనియాకు జగన్ లేఖ

పార్టీ అనుమతి లేకపోతే కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు జగన్ తో సహకరించడం ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో జగన్ అనుమతి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, జగన్ రాష్ట్ర పర్యటనకు పార్టీ అనుమతి అవసరం లేదని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఇదివరకే చెప్పారు. ఆ యాత్ర జగన్ వ్యక్తిగతమని, పార్టీతో దానికి సంబంధం లేదని ఆయన చెప్పారు. జగన్ పర్యటనను రాజకీయం చేయవద్దని కూడా ఆయన కోరారు. అయితే, జగన్ ఓదార్పు యాత్రకు సీనియర్ల నుంచి ఏ మాత్రం సహకారం లేదు. చాలా మంది సీనియర్ నాయకులు మౌనంగా ఉన్నప్పటికీ ఆ యాత్ర జరగకుండా చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications