కాంగ్రెసువాళ్లే అల్లర్లు చేయిస్తున్నారు: బాబు

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా అధికార కాంగ్రెసు పార్టీ ప్రయత్నించిందని ఆయన విమర్శించారు. గనుల మాఫియా కేంద్ర ప్రభుత్వానికే సవాల్ గా మారిందని, గనుల మాఫియా పార్టీలను శాసిస్తోందని ఆయన అన్నారు. ప్రభుత్వ భూములు కబ్జా అపుతున్నాయని, పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములు కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని ఆయన అన్నారు. కృష్ణా జలాలపై పంపకంపై ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. గోదావరి లాగే కృష్ణా నది కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు. కాగ్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications