హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపి విషయం మా అంతర్గతం: సిఎం

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ప్రజా భద్రతా సలహాదారుగా కెవిపి రామచందర్ రావును కొనసాగించాలా, వద్దా అనేది తమ అంతర్గత విషయమని ముఖ్యమంత్రి కె. రోశయ్య అన్నారు. శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెవిపిని తొలగించాలని వస్తున్న డిమాండ్ పై ఆయన ఆ విధంగా ప్రతిస్పందించారు. హైదరాబాద్ పరిస్థితి సద్గుమణిగిన తర్వాత ఢిల్లీ వెళ్తానని, మీడియాకు చెప్పే మంత్రివర్గాన్ని విస్తరిస్తానని ఆయన చెప్పారు. హైదరాబాద్ అల్లర్ల విషయంలో ప్రతిపక్షాలన్నీ సహకరించాయని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) లేకపోవడం వల్లనే సభ సజావుగా జరిగిందని భావించడం లేదని, తెరాస సభలో లేని లోటు కనిపించలేదని ఆయన అన్నారు. కొత్త సభ్యుల తీరు బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందనే ప్రకటనలు సరి కావని, ఇటువంటి ప్రకటనలు సమస్యను మరింత జఠిలం చేస్తాయని ఆయన అన్నారు. హైదరాబాద్ అల్లర్ల విషయంలో ప్రతిపక్షాలు హుందాగా వ్యవహరించాయని ఆయన ప్రశంసించారు. మీ వారి సంగతేమిటంటే మా వారి ప్రకటనలు చూస్తానని ఆయన అన్నారు.

హైదరాబాద్ అల్లర్ల వెనక రోశయ్య ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉందనే విమర్శలు చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీకి, శాసనసభ్యుడు శంకరరావుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఫోన్ చేశారు. అటువంటి ప్రకటనలు సరి కావని ఆయన వారికి చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ అల్లర్లు దురదృష్టకరమని డిఎస్ అన్నారు. మత సామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అని, కొన్ని మతతత్వ శక్తులు సమస్యను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X