ఇతర ప్రాంతాలకు విస్తరించిన అల్లర్లు

Hyderabad Clashes
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావిస్తున్న తరుణంలో అల్లర్లు ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. పాతబస్తీలోని అల్లర్లు ముషీరాబాద్‌కి పాకాయి. మంగళవారం మధ్యాహ్నం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరు వర్గాలకు చెందిన వారు పర్పర దాడులకు దిగారు. పలు షాపులు, వాహనాలను ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తేచ్చేందుకు పోలీసులు లాఠీఛార్జీ, భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో నగర కమిషనర్ ఏకె ఖాన్ పర్యటించి సమీక్షించారు.భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

కాగా, పాతబస్తీలో పరిస్థితి అదుపులో ఉందని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ చెప్పారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ కర్ఫ్యూ సడలించే అవకాశం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇప్పటి వరకు 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో పాతబస్తీలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తామని ఆయన చెప్పారు. అల్లర్లకు కారణమైనవారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అల్లర్ల వెనక ఎవరున్నారనే విషయంపై కూపీ లాగుతున్నట్లు ఆయన తెలిపారు. కర్ఫ్యూ సడలింపుపై రేపు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+