రోశయ్య మంత్రివర్గ విస్తరణ వాయిదా?

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రివర్గ విస్తరణ వాయిదా పడే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ అల్లర్లు, తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశాల వల్ల మంత్రివర్గ విస్తరణను ఆయన వాయిదా వేయనున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్ మొదటివారంలో రోశయ్య ఢిల్లీ వెళ్లి మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెసు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందుతారని అనుకుంటూ వస్తున్నారు. ఆయితే ఇప్పటి వరకు రోశయ్య ఢిల్లీ పర్యటన ఖరారు కాలేదు. తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగిన తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాగా, మంత్రి విస్తరణ ఏప్రిల్ లో కచ్చితంగా ఉంటుందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యులు అంటున్నారు. ఉప ఎన్నికల కోసం విస్తరణ ఆగబోదని వారు గట్టిగా నమ్ముతున్నారు. ఉప ఎన్నికల కోసం ఆగదలిస్తే ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలు వస్తాయని, అందువల్ల ఉప ఎన్నికలకూ మంత్రివర్గ విస్తరణకూ సంబంధం లేదని వారంటున్నారు. జూన్ లో లేదా జులైలో తెలంగాణలోని శాసనసభా నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. హైదరాబాద్ అల్లర్లు కూడా మంత్రివర్గ విస్తరణ విషయంలో రోశయ్యను పునరాలోచనలో పడేసినట్లు చెబుతున్నారు. ఏమైనా, మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికీ ఒక కచ్చితమైన విషయం వెల్లడి కావడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+