హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెవిపినే అంటారా?: సీమాంధ్ర యువ ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

KVP Ramachandar Rao
హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ అల్లర్లకు కారకుడైన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు ప్రజా భద్రత సలహాదారుగా తొలగించాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చేసిన డిమాండ్ పై కాంగ్రెసు సీమాంధ్ర యువ శాసనసభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ అల్లర్ల వెనక ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఉందని యాష్కీ చేసిన విమర్శపై కూడా వారు ధ్వజమెత్తారు. మల్లాది విష్ణు తదితర సీమాంధ్ర యువ శాసనసభ్యులు మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కెవిపి రామచందర్ రావును విమర్శించే స్థాయి మధు యాష్కీకి లేదని వారన్నారు. యాష్కీ దొడ్డి దారిన పార్టీలోకి వచ్చి పార్లమెంటు సభ్యుడయ్యారని, అందువల్ల యాష్కీకి కెవిపిని విమర్శించే అర్హత లేదని వారన్నారు.

ముఖ్యమంత్రి రోశయ్య వెనక తామంతా ఉన్నామని, వైయస్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తున్న రోశయ్యకు తాము పూర్తి మద్దతుగా నిలుస్తామని వారు చెప్పారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచే ప్రయత్నాలను తాము సాగనివ్వబోమని వారు స్పష్టం చేశారు. హైదరాబాద్ అల్లర్ల వెనక సీమాంధ్ర నాయకుల కుట్ర ఉందనే తెరాస ఆరోపణపై కూడా వారు విరుచుకుపడ్డారు. చౌకబారు ఆరోపణలతో చౌకబారు రాజకీయాలు చేయవద్దని వారు సలహా ఇచ్చారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా, వారిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని తాము సహించబోమని వారు చెప్పారు.

కాంగ్రెసులో స్వేచ్ఛ ఎక్కువైపోయిందని, మధుయాష్కీ కెవిపిపై విమర్శలు చేస్తే, మరో శాసనసభ్యుడు పార్టీలోనివారి కుట్ర అల్లర్ల వెనక ఉందని అన్నారని, ఇటువంటి ప్రకటనలు సరైనవి కావని వారన్నారు. దీనిపై తాము కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు ఫిర్యాదు చేస్తామని వారు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X