వరంగల్: తోటి విద్యార్థి వేధింపులు తాళలేక వరంగల్ లోని ఎల్బీ నగర్ లో ప్రత్యూష అనే బిటెక్ విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ ఫైనలియర్ చదువుతున్న ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. ప్రేమ పేరుతో ఓ యువకుడు ఆమెను వేధిస్తూ వస్తున్నట్లు ప్రత్యూష తన సూసైడ్ నోట్ లో రాసింది.
తన ఫొటోలు పెట్టుకుని తనను నిత్యం వేధిస్తున్నాడని, ఆ యువకుడి వేధింపులు భరించలేకనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రత్యూష సూసైడ్ నోటులో రాసింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.