పరిటాల హత్య కేసులో భానుమతి సాక్ష్యం

Gangula Bhanumathi
అనంతపురం: తెలుగుదేశం నాయకుడు పరిటాల రవీంద్ర హత్య కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్‌ సాక్షులుగా ఈ కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి భార్య, కాంగ్రెస్‌ నాయకురాలు గంగుల భానుమతి, ఆమె తల్లి అమ్మాయమ్మలు కోర్టులో హాజరై సాక్ష్యం చెప్పారు. సీబీఐ వీరిద్దరిని ప్రాసిక్యూషన్‌ సాక్షులుగా సెషన్స్‌ కోర్టుకు పిలిపించింది. అయితే వీరు సీబీఐకి సహకరించలేదు. సహకరించని సాక్షులుగా కోర్టు నమోదు చేసింది. తొలుత భానుమతి తల్లి అమ్మాయమ్మను సీబీఐ న్యాయవాది విచారించారు.

అయితే అమ్మాయమ్మకు తెలుగు భాష రాకపోవడంతో విచారణ మధ్యాహ్ననికి వాయిదా పడింది. కన్నడ భాష తెలిసిన ఒక న్యాయవాదిని కోర్టుకు సహ కరించమని జిల్లా జడ్జి మొదట కోరగా, డిఫెన్స్‌ న్యాయవాదులు అభ్యంత రం తెలిపారు. దీంతో అనువాదకుడిని తీసుకురమ్మని, సీబీఐని ఆదేశిస్తూ కేసును మధ్యాహ్ననికి వాయిదా వేశారు. తర్వాత స్థానిక ఎస్‌ఎస్‌బిఎన్‌ కళాశాల కన్నడ అధ్యాపకుడు సదానందంను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరుచగా భానుమతి తల్లి అమ్మాయమ్మను అనువాదకుడి సహాయంతో కోర్టు విచారించింది. ఈమె సాక్ష్యం చెబుతూ భానుమతి పెళ్ళి అయిన తేదీ తనకు తెలియదని, తన ఇంటి ఫోన్‌ నెంబర్‌ తనకు తెలియదని, తాను బెంగళూరులో వున్న మాట వాస్తవమేనని అయితే వీధి పేరు నాకు తెలియదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. దీంతో ప్రాసిక్యూషన్‌కు సహకరించని సాక్షిగా కోర్టు అమ్మాయమ్మను నమోదు చేసింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూర్యనారాయణరెడ్డి భార్య, కాంగ్రెస్‌ నాయకురాలు గంగుల భానుమతి మంగళవారం జిల్లా సెషన్స్‌ కోర్టులో సీబీఐ త రుపున సాక్షిగా హాజరయ్యారు. తన భర్త గంగుల సూర్యనారాయణరెడ్డి 1997 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 2010 వరకు జైలులో గడిపారని, గంగుల సూర్యనారాయణరెడ్డితో తనకు 1994లో పెళ్లి అయిందని, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ కారుబాంబు కేసులో తన భర్త సూర్యనారాయణరెడ్డి శిక్ష అనుభవించారని, తన తల్లిదండ్రులు బెంగళూరులోని గంగానగర్‌లో నివసిస్తున్నారని, అయితే వారి ఇంటి ఫోన్‌ నెంబర్‌ తనకు తెలియదని సమాధానం చెప్పారు. '2335865 అనే నంబర్‌ కు తరచూ సూరి ఫోన్‌ చేసే వాడని మీరు మాట్లాడే వార'ని సీబీఐ న్యాయవాది ప్రశ్నించగా, 'లేదు అని' సమాధానమిచ్చారు. పరిటాల రవీంద్ర హత్య కేసులో సీబీఐ నిన్ను ప్రశ్నించింది కదా?' అనే ప్రశ్నకు 'అవును' అని భానుమతి చెప్పారు.

గంగుల సూర్యనారాయణరెడ్డి తండ్రి నారాయణరెడ్డి పెనుకొండ మాజీ ఎమ్మెల్యే కదా అని ప్రశ్నించగా తనకు తెలియదన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పెనుకొండలో పోటీ చేశారు కదా, అప్పుడు మాత్రమే మద్దెల చెరువులో వున్నారని మిగతా సమయం బెంగళూరులో వున్నారని సీబీఐ న్యాయవాది ప్రశ్నించగా, 'లేదు' అని ఆమె సమాధానం ఇచ్చారు. 'మద్దెల చెరువులో వున్న మీ ఇంటి ఫోన్‌ నంబర్‌ చెప్పండని అడుగగా, తమకు మద్దెల చెరువులో ఇల్లు లేదని, తమ మామగారి ఇంటి లో వుండే వారమని తెలిపారు. మద్దెల చెరువులో తమకు 300 ఎకరాల పొలం ఉన్నదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నాగళూరుకు చెందిన భాస్కర్‌రెడ్డి తెలుసా అని న్యాయవాది అడుగగా 'తెలుసు' అని అన్నారు.

సీబీఐ విచారించినప్పుడు మీరు నాగళూరు భాస్కర్‌రెడ్డి ఇంటిలో ఉన్నారు కదా ఆ ఇంటి ఫోన్‌ నెంబర్‌ చెప్పమనగా తనకు తెలియదని సమాధానమిచ్చారు. వీరిద్దరిని విచారించక ముందు, అం తకుముందు అసంపూర్ణంగా మిగిలిన సాక్షి, బెంగుళూరుకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారి మురళీమోహన్‌ను డిఫెన్స్‌ న్యాయవాదులు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిని విచారించిన తర్వాత అమ్మాయమ్మను, భానుమతిని విచారించేందుకు కోర్టు అనుమతించగా వారి విచారణ పూర్తయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+