ప్రభుత్వాలపై చంద్రబాబు ధ్వజం

Chandrababu Naidu
హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన బుధవారం ప్రసంగించారు. కృష్ణా జలాల పంపకంపై ట్రిబ్యునల్ ముందు మన వాదనలు వినిపించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రభుత్వ చర్య వల్ల కృష్ణా నది నీళ్లు రాష్టానికి అందే పరిస్థితి చేజారి పోతోందని ఆయన అన్నారు. ట్రిబ్యునల్ పై కృష్ణా జలాలపై వినిపించే వాదనలపై ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదని, నిపుణుల సలహాలు కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. సభలో తాము ఆ విషయాన్ని ప్రస్తావిస్తే వాయిదా వేసుకుని ప్రభుత్వం వెల్లి పోయిందని ఆయన అన్నారు.

నిత్యావసర సరుకులను అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన అన్నారు. కేంద్రం ధరల అదుపు విషయంలో మాయమాటలు చెబుతోందని ఆయన అన్నారు. బియ్యం, పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు పేదలకు అందుబాటులో లేకుండా పోయాయని ఆయన అన్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో నీటి సమస్య పెరుగుతోందని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.

పార్టీ మహానాడును మే 28వ తేదీన హైదరాబాదులో నిర్వహించాలని తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం నిర్ణయించింది. అదే రోజు పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. ఏప్రిల్ 5 నుంచి 20వ తేదీ వరకు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. మే 1 నుంచి 8వ తేదీ వరకు గ్రామ కమిటీల ఏర్పాటవుతాయి. మే 12 నుంచి 15వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీలు ఏర్పడ్తాయి. మే 18 నుంచి 20వ తేదీ వరకు జిల్లా కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+