న్యూఢిల్లీ: హైదరాబాద్ నగరం ప్రశాంతంగానే ఉందని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం అన్నారు. నగరంలో జరిగిన ఒక చిన్న సంఘటనను ఆసరాగా తీసుకుని రౌడీమూకలు చెలరేగాయని ఆయన అన్నారు. అల్లర్లకు పాల్పడిన 130 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ సంఘటనలకు పాల్పడినవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.
ప్రస్తుతం హైదరాబాదులోని ప్రశాంత వాతావరణం నెలకొంటోందని ఆయన చెప్పారు.ముంబై దాడి కేసులో ఉగ్రవాది కసబ్ పై ప్రత్యేక కోర్టులో వాదోపవాదాలు ముగిశాయని, ఈ కేసులో 650 మంది సాక్షులను కోర్టు విచారించిందని ఆయన చెప్పారు.