అల్లర్ల వెనక సీమాంధ్ర సంపన్నులు: కోదండరామ్

తెలంగాణ అంశాన్ని పక్కదారి పట్టించడం సీమాంధ్ర సంపన్న వర్గాల ఉద్దేశమని, అందులో భాగంగానే హైదరాబాదులో అల్లర్లు జరిగాయని ఆయన అన్నారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని వెనక్కి పంపించేందుకు సీమాంధ్ర సంపన్న వర్గాలు కుట్ర చేశాయని ఆయన అన్నారు. జెండాలన్నీ ఒకే రకంగా ఉన్నాయని, పథకం ప్రకారం జెండాలను పెట్టారని ఆయన అన్నారు. కుట్రదారులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ జిల్లాల్లో రేపటి నుంచి అలైబలై యాత్రలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications