పరిస్థితి అదుపులో ఉంది: సబిత

కర్ప్యూ ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను ఆదేశించారు. కర్ఫ్యూ ప్రాంతాల్లో అధికారులు పర్యటించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. మునిసిపల్ కార్మీకులకు కర్ఫ్యూ పాసులు ఇవ్వాలని సూచించారు. నిత్యావసర సరుకుల పంపిణీపై కలెక్టర్ ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. ప్రశాంత వాతావరణానికి సహకరించాలని ఆమె ప్రజలను కోరారు. ప్రజలు సహకరిస్తేనే అల్లర్లకు అడ్డుకట్ట వేయగలమని ఆమె అన్నారు. అల్లర్లకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.












Click it and Unblock the Notifications