అల్లర్లకు సిఎందే బాధ్యత: తలసాని

Talasani Srinivas Yadav
హైదరాబాద్: హైదరాబాద్ అల్లర్లకు ముఖ్యమంత్రి కె. రోశయ్య నైతిక బాధ్యత వహించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలను ముఖ్యమంత్రి పరామర్సించాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. అల్లర్లలో కుట్ర ఉందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెసు నాయకుల నుంచి లిఖిత పూర్వక ఫిర్యూదులు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెసు నాయకుల ఆరోపణల్లో వాస్తవం ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆరోపణలు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. హైదరాబాద్ పోలీసులు సమర్థంగా పనిచేస్తారని, విధి నిర్వహణలో వారికి స్వేచ్ఛను ఇవ్వాలని ఆయన అన్నారు.

తెలంగాణ వ్యతిరేకులంతా ఏకమై హైదరాబాద్ లో అల్లర్లు సృష్టించారని తెలంగాణ ప్రజా గాయకుడు గద్గర్ ఆరోపించారు. హైదరాబాద్ అల్లర్ల వెనక కుట్ర ఉందని కాంగ్రెసు నాయకులు చేసిన ప్రకటనతో బలపడుతోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+