లగడపాటి రాజగోపాల్ దిష్టిబొమ్మ దహనం

హైదరాబాద్ లో జరుగుతున్న అల్లర్లకు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు. లగడపాటి తన అస్తులను కాపాడుకునేందుకే సమైక్యాంధ్ర నినాదాలు చేస్తున్నారని విమర్శించారు. రోశయ్య ప్రభుత్వాన్ని గద్దె దించడానికే ఘర్షణలు చేయిస్తున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు కొప్పిశెట్టి సూర్యనారాయణమూర్తి, చెరుకూరి గోపాలకృష్ణ, ఆరెళ్ల సూరిబాబు, అప్పన గణపతిరావు, కె.సుబ్రహ్మణ్యం, పాలూరి సత్యానందం తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
హైదరాబాదు మతకల్లోలాలకు బీజేపీయే కారణమంటూ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన ఆరోపణలపై అప్పనపల్లిలో బుధవారం జరిగిన మండల బీజేపీ కార్యకర్తల సమావేశం నిరసన వ్యక్తం చేసింది. సమావేశంలో జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు బి.ఎస్.మూర్తి, మండల శాఖ అధ్యక్షుడు కంకిపాటి సుబ్బారావు, జి.ఎస్.శర్మ, ఎన్.అన్నపూర్ణేశ్వరరావు తదితరులుపాల్గొన్నారు.












Click it and Unblock the Notifications