తిరుపతి-కాళహస్తి మధ్య మెట్రో రైలు సర్వీసులు!

మెట్రోరైలు ఏర్పాటుకు రూ.2700 కోట్లు ఖర్చు అవుతుందని రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో అంచనాకు వచ్చారు. ప్రధానంగా తిరుపతి-శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాలను కలుపుతూ మెట్రోరైలు ఏర్పాటుకు ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు, అమలుకు సంబంధించిన వ్యవహారాలను తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ చూస్తోంది. తుడ పరిధి విస్తరించినందున శ్రీకాళహస్తి వరకు ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతంగా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.












Click it and Unblock the Notifications