విశాఖపట్టణం: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని పాతబస్తీలో పరిస్థితి కుదుటపడిందని ముఖ్యమంత్రి కె రోశయ్య అన్నారు. సోమవారం అక్కడ మరింత కర్ఫ్యూ సడలింపు ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎంతమేర సడలింపు ఇవ్వాలనేది శాంతిభద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయిస్తారనిన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే కర్ఫ్యూ పెట్టామని అన్నారు.
పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు టీటీడీ నిర్వహించనున్న వేంకటేశుని కల్యాణోత్సవంలో పాల్గొననేందుకు ముఖ్యమంత్రి ఆదివారం విశాఖపట్టణం వచ్చారు. ఆయనకు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు.