గుంటూరులో పొగాకు రైతుల ఆందోళన

ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు నాసిరకం విత్తనాలు సరఫరా చేశారని రైతులు పేర్కొన్నారు. దాంతో పంట దిగుబడి తగ్గి రైతులు నష్టాల్లో కూరుకుపోయారని, కనీసం పెట్టుబడులు అయినా రావాలని వారు కోరుతున్నారు.
టుబాకో బోర్డు ఛైర్మన్ తమతో చర్చలు జరిపి హామీ ఇచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. గతంలో కూడా గుంటూరు జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రితో తమ సమస్యను చెప్పామని, తమకు సహాయం చేస్తామని హామీ ఇచ్చానట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో గిట్టుబాటు ధర కల్పించని పక్షంలో హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రోశయ్య వద్దకు వెళతామని రైతులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications