ఎమ్మెల్సీ సీట్ల కోసం కాంగ్రెసులో పోటీ

పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కూడా ఈ స్థానాన్ని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిఎస్ ఉప ఎన్నికల్లో నిజామాబాద్ నుండి శాసనసభకు పోటీచేస్తారా, లేక రాజ్యసభకు వెళతారా అనే విషయం తేలడం లేదు. డిఎస్ వ్యవహారంపైనే షబ్బీర్ అలీకి గ్రేటర్ ఎమ్మెల్సీ సీటు కేటాయించే విషయం ఆధారపడివుంటుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థలు మెజారీటి స్థానాలు తెలుగుదేశంపార్టీ ఆధీనంలో ఉన్నాయి. తాండూరు ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సోదరుడు నరేందర్‌రెడ్డి ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications