శ్రీకృష్ణ కమిటీని గడువు కోరుతాం: మొయిలీ

Veerappa Moily
హైదరాబాద్: నివేదికలు సమర్పించడానికి పెట్టిన గడువును పెంచాలని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని కోరుతామని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ చెప్పారు. రాష్ట్ర పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీ రాష్ట్ర విభజనపై నివేదికలు సమర్పించేందుకు ఏప్రిల్ 10వ తేదీని తుది గడువుగా ప్రకటించింది. ఈ గడువును పెంచాలని కోరుతామని మొయిలీ చెప్పారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) సమన్వయ కమిటీ సమావేశానంతరం ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీ సంస్థాగత ఎన్నికలపై, ప్రభుత్వం చేపట్టే ప్రజాపథం కార్యక్రమంపై, కాంగ్రెసు 125 ఏళ్ల ఉత్సవాలపై సమావేశంలో చర్చించినట్లు ఆయన తెలిపారు.

సంస్థాగత ఎన్నికల నిర్వహణకు పిసిసి ఏర్పాట్లు బాగున్నాయని ఆయన అభినందించారు. అందుకు పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను ఆయన ప్రశంసించారు. తెలంగాణలో శాసనసభ నియోజకవర్గాలకు జరిగే ఉప ఎన్నికలపై సమావేశంలో చర్చించలేదని ఆయన చెప్పారు. హైదరాబాద్ అల్లర్లపై కొందరు కాంగ్రెసు నాయకులు కుట్ర ఉందంటూ చేసిన ఆరోపణలపై ఆయన విచారం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు అలాంటి బహిరంగ ప్రకటనలు చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. పిసిసి సమన్వయ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కె. రోశయ్యతో పాటు పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్, కెవిపి రామచందర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ కమిటీకి డి శ్రీనివాస్ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+