బాలసాయి దొంగ బాబా: మాజీ మంత్రి

లింగాలను తీసినంత మాత్రాన దేవుడవుతాడా..? ప్రజలను మోసం చేసే ఇలాంటి బాబాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. గుప్త నిధులు కాజేస్తున్న వారిలో అధిక శాతం బాబాలే వున్నారని మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బాలసాయిబాబా పై మండిపడ్డారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రోశయ్య పనితీరు బాగుందని కితాబిచ్చారు.
కడప ఎంపీ వైఎస్ జగన్, ముఖ్యమంత్రి రోశయ్య కలవడం కాంగ్రెస్ పార్టీకి శుభ సూచికమని, వారి మధ్య విభేదాలు లేవని ఈకలయిక చాటినట్లయిందన్నారు. ఐఏఎస్ అధికారులు కూడా అవినీతికి పాల్పడుతున్నారంటూ ఇక్కడ కలెక్టర్ పనిచేసి బదిలీపై వెళ్లిన ముఖేష్ కుమార్ మీనా రూ. 20 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆయనపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications