ఇంటికి క్షేమంగా చేరిన ఇన్ఫోసిస్ లక్ష్మీప్రియ

సోమవారం ఉదయం జరిగిన సంఘటన వివరాలివి....అనుమానాస్పద పరిస్థితుల్లో ఇన్ఫోసిస్ ఉద్యోగిని లక్ష్మీ ప్రియ అదృశ్యమైంది. ఆమె కిడ్నాప్ అయి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కార్ఖానా పోలీసులు ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కార్ఖానా ప్రాంతంలోని కాకాగూడ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ బేగంపేట్‌లోని ఓడఫోన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.
ఆయన భార్య లక్ష్మీప్రియ (35) ఇన్ఫోసిస్ కం పెనీలో క్వాలిటీ కంట్రోల్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తోంది. వీరికి ఓ కుమారుడు ఉన్నాడు. ప్రతిరోజు లక్ష్మీప్రియ ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చి కార్ఖాన పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో బస్సు ఎక్కేది. సోమవారం ఎప్పటిలానే బస్టాప్‌కు వచ్చింది. అయితే బస్సు వెళ్లిపోవటంతో అక్కడే ఉన్న ఆటో ఎక్కింది. బస్సును ఛేజ్ చేయాలని చెప్పింది.
బస్సు జూబ్లీ బ స్టాండు నుంచి నేరుగా ప్యాట్నీ వైపు వెళ్లిపోగా, ఆటోడ్రైవర్ జూబ్లీ బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డులోకి ఆటోను మళ్లించాడు. అప్పటికే ఆటోలో ఇంకో వ్యక్తి ఉన్నట్లు తెలిసింది. ఆటోలో ఉన్న లక్ష్మీప్రియ తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ కలిగి ఉన్న పర్సును రోడ్డుపైకి విసిరింది. ఆ సమయంలో అటుగా కూకట్ పల్లి స్టేషన్ లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెళుతున్నారు. వారికి ఆ పర్సు దొరికింది.
కానిస్టేబుళ్లతోపాటు జూబ్లీ బస్టాండ్ వద్ద విధుల్లో ఉన్న మరో ఇద్దరు కానిస్టేబుళ్లు లక్ష్మీప్రియ పర్సును విసిరేయటం చూశారు. కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు బ్యాగు తెరిచి చూడగా సెల్ ఫోన్ కనిపించింది. కాంటాక్ట్ లిస్టులో హోం అన్న నెంబర్ కు డయల్ చేయగా లక్ష్మీప్రియ భర్త లక్ష్మణ్ వారితో మాట్లాడాడు. లక్ష్మణ్ కు కానిస్టేబుళ్లు జరిగిన విషయం చెప్పి తాము కూకట్ పల్లి స్టేషన్ కు వెళుతున్నట్టు చెప్పారు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications