నాది రాజకీయం కాదు: వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్: పార్టీకి నష్టం కల్గించేందుకు తాను ప్రయత్నించడం లేదని కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు, దివంగత వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి రోశయ్యకు వివరణ ఇచ్చారు. తాను చేపట్టిన ఓదార్పు కార్యక్రమం రాజకీయమైనది కాదని ఆయనకు స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో పార్టీ ఎలా ఐక్యంగా సాగిందో ఇప్పుడు కూడా అలానే ముందుకు వెళ్లేందుకు సహకరించాలని రోశయ్య జగన్ ను కోరారు. విభేదాలుంటే అందరికీ నష్టమేనని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రోశయ్య నివాసంలో మంగళవారం రాత్రి జగన్ ఆయనతో సమావేశమయ్యారు. దాదాపు గంటా పది నిమిషాల పాటు వారి మధ్య సమావేశం జరిగింది.

పశ్చిమగోదావరి, ఖమ్మం జిల్లాల్లో నిర్వహించనున్న ఓదార్పు కార్యక్రమం సహా వివిధ అంశాలపై రోశయ్యకు జగన్ వివరణలు ఇచ్చుకున్నారు. ఓదార్పు కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినదీ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి రోశయ్య ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని సమాచారం. ఈ పర్యటన రాష్ట్రంలో రాజకీయంగా ఎలాంటి ప్రభావం లేకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు. తనకు తానుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించలేదని..అధిష్ఠానం ఆదేశాల మేరకే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించానని రోశయ్య స్పష్టం చేశారు. అధిష్ఠానం ఏ క్షణానైన్నా ముఖ్యమంత్రి సీటు నుంచి దిగిపోమ్మంటే ఆ క్షణమే దిగిపోతానని చెప్పారు.

తన ఓదార్పు కార్యక్రమానికి మందు పశ్చిమ గోదావరి జిల్లాలో పలువురు పోలీసు అధికారులను బదిలీ చేయడం కూడా చర్చకు వచ్చింది. శాంతి భద్రతల నేపథ్యంలోనే బదిలీలు జరిగినట్లు రోశయ్య వివరించారు. ఇలాంటి వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని రోశయ్య స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అంశం కూడా వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది. బుధవారం తాను ఢిల్లీకి వెళ్తున్నానని, అధిష్ఠానం ఆదేశాల మేరకు నడుచుకుంటానే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోనని రోశయ్య స్పష్టం చేశారు. మంత్రివర్గం గురించి ఇంకా ఆలోచించలేదని జగన్‌తో చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+