డిఎస్ తో ముగిసిన జగన్ భేటీ

తాను ఈ నెల 9వ తేదీ నుంచి తలపెట్టిన ఓదార్పు యాత్రపై వైయస్ జగన్ డిఎస్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యతో చెప్పిన విషయాలే జగన్ డిఎస్ తోనూ చెప్పినట్లు సమాచారం. తాను తలపెట్టిన ఓదార్పు యాత్ర పార్టీకి వ్యతిరేకం కాదని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదని జగన్ డిఎస్ తో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డిఎస్, కెవిపి, జగన్ ఒకే వాహనంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడి పెళ్లికి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications