కెసిఆర్ రక్తమాంసాల వ్యాపారి: లగడపాటి

Lagadapati Rajagopal
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారని విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే కెసిఆర్ హైదరాబాదులో చల్లటి నీడలో ఉంటూ వారి రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండడానికి కోటి మంది లగడపాటిలు అవసరం లేదని, ఒక్క కెసిఆర్, ఒక్క తెరాస చాలునని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి తెరాస శ్రీకృష్ణ కమిటీకి నివేదిక చాలునని ఆయన అన్నారు. 1956 నవంబర్ 1వ తేదీ పూర్వ రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని కెసిఆర్ అడుగుతున్నారని, అది సాధ్యమయ్యేది కాదని ఆయన అన్నారు.

నైజాంలో అప్పుడు 16 జిల్లాలున్నాయని, వాటిలో ప్రస్తుతం 5 జిల్లాలో మహారాష్ట్రలో, మూడు జిల్లాలు కర్నాటకలో ఉన్నాయని, మిగతా 8 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని ఆయన చెప్పారు. భద్రాచలం నిజాం పాలనలో లేదని, దాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలుపుతారా అని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలోని కొన్ని గ్రామాలు నిజాం పాలనలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ రకంగా 1956 పూర్వ స్థితిని కల్పించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ల్యాంకో ద్వారా తాను విద్యుదుత్పత్తి చేసి రాష్ట్రానికి మేలు చేస్తున్నానని చెబుతూ కెసిఆర్ ఒక్క మెగావాటైనా ఉత్పత్తి చేశారా అని ఆయన అడిగారు. విద్యార్థులకు తాను సేవలు చేశానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+