• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

దళితులను కాంగ్రెసు వాడుకుంది: బాబు

By Pratap
|

Chandrababu Naidu
హైదరాబాద్: దళితులను తన స్వార్థప్రయోజనాల కోసం కాంగ్రెసు వాడుకుంటోందే తప్ప వారికి చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెసు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల సంక్షేమం నీరుగారి పోయిందని ఆయన అన్నారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

అంటరానితనాన్ని పూర్తిగా రూపుమాపాలన్నదే అంబేడ్కర్ లక్ష్యమని, ఆ దిశగా అందరూ పని చేయాలని ఆయన అన్నారు. దళితులైన ప్రతిభా భారతి, బాలయోగి వంటి నాయకులకు తమ పార్టీ సముచిత స్థానాలు కల్పించిందని ఆయన గుర్తు చేశారు. దళితులకు తమ పార్టీ ఎంతో చేసిందని, ఏమైనా జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X